ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లోరెండు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అందులో టీం ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో విన్నర్ హైదరాబాద్, రన్నర్ రంగారెడ్డి నిలిచాయి. మహిళలు టీం ఛాంపియన్షిప్ విన్నర్ ఖమ్మం, రన్నర్ హైదరాబాద్ నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది పాల్గొన్నారు.
వ్యాపారవేత్తలు రాపర్తి రాజా, విజయబాబు, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ స్టేట్ సెక్రటరీ జోసఫ్, ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్, చైర్మన్ బుచ్చి దాస్ , ఖమ్మం డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ మనోజ్ కుమార్, క్లాసిక్ జిమ్ ప్రొప్రైటర్ నగిన చౌదరి విజేతలకు బహుమతులను అందజేశారు.