స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్ వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పోలేపల్లి సెజ్ సమీపంలో ఉన్న ఎస్వీకేఎం స్కూల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. సైన్స్ ఫేర్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి స్టూడెంట్లు హాజరై ప్రాజెక్టులను ప్రదర్శించారు. చైల్డ్సైంటిస్టులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అబ్బురపరిచాయి. ఏడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను చైల్డ్ సైంటిస్టులు తోటి స్టూండెట్లకు వివరిస్తూ అవగాహన కల్పించారు.
వీటిని చూసేందుకు ఉదయం 10 గంటల నుంచే జిల్లాలోని ఆయా స్కూల్స్ కు చెందిన స్టూడెంట్లకు స్టాల్స్ వద్దకు చేరుకొని వాటిని పరిశీలించారు. అనంతరం వాటి పని తీరు గురించి తెలుసుకున్నారు. కొన్ని ప్రదర్శనలు చీఫ్ గెస్టులను ఆకట్టుకోవడంతో వారు చైల్డ్ సైంటిస్టులను అభినందించారు. ప్రాజెక్టుల్లో కొన్ని ప్రదర్శనలను చూపరులను ఆలోచింపజేశాయి.