జనవరి 7 నుంచి పాలమూరులో స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌

జనవరి 7 నుంచి పాలమూరులో స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌
  • మూడు రోజుల పాటు నిర్వహణ

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : రాష్ట్ర స్థాయి సైన్స్‌‌ ఫెయిర్‌‌ నిర్వహణకు మహబూబ్‌‌నగర్‌‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌‌లో ఉన్న ఎస్‌‌వీకేఎం స్కూల్‌‌లో నేటి నుంచి గురువారం వరకు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్‌‌ ఫెయిర్‌‌ ప్రారంభ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆర్‌‌అండ్‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇటీవల సైన్స్‌‌ ఫెయిర్‌‌ నిర్వహించి అందులో నుంచి ఉత్తమ ఎగ్జిబిట్లను స్టేట్‌‌ లెవల్‌‌కు ఎంపిక చేశారు.

స్టేట్‌‌ లెవల్‌‌లో మొత్తం 863 సైన్స్‌‌ ఎగ్జిబిట్లు, 33 టీచర్‌‌ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. సైన్స్‌‌ ఎగ్జిబిట్స్‌‌లో నుంచి 55 ప్రదర్శనలను జాతీయ స్థాయికి సెలెక్ట్‌‌ చేయనున్నారు. వీటి ఎంపికకు ఢిల్లీ నుంచి స్పెషల్‌‌ ఆఫీసర్లు వస్తుండగా, మహబూబ్‌‌నగర్‌‌లోని పాలమూరు యూనివర్సిటీ, ఎన్‌‌టీఆర్‌‌, ఎంవీఎస్‌‌ డిగ్రీ కాలేజీలు, జేపీఎన్‌‌సీఈ కాలేజీ నుంచి న్యాయనిర్ణేతలు రానున్నారు. 14 ఏండ్ల తర్వాత మహబూబ్‌‌నగర్‌‌లో రాష్ట్ర స్థాయి సైన్స్‌‌ ఫెయిర్‌‌ నిర్వహణకు అవకాశం రావడంతో ప్రోగ్రామ్‌‌ను సక్సెస్‌‌ చేసేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రతి ప్రాజెక్ట్‌‌కు ఒక స్టూడెంట్‌‌తో పాటు గైడ్‌‌ టీచర్‌‌కు అనుమతి ఉంటుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి స్టూడెంట్లు, టీచర్లు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు. వీరికి మూడు రోజుల పాటు భోజనం, వసతి కల్పించనున్నారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్‌‌ విజయేందిర బోయి మొత్తం 25 కమిటీలను ఏర్పాటు చేశారు. బుధ లేదా గురువారాల్లో సీఎం రేవంత్‌‌రెడ్డి వచ్చే అవకాశం ఉందని 
ఆఫీసర్లు చెబుతున్నారు.