నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రస్థాయిలో షూటింగ్ బాల్ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సీహెచ్ ఐలయ్య అన్నారు. బుధవారం నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో 43 వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్ జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ పోటీల్లో 25 బాయ్స్ టీమ్స్, 15 బాలికల టీమ్స్ పాల్గొన్నాయి. రాష్ట్ర ఛాంపియన్ బాలికల విభాగం లో మహబూబాబాద్ విన్నర్ గా నిలవగా, రన్నర్ నల్గొండ నిలిచింది. బాలుర విభాగంలో విజేతగా సంగారెడ్డి, రన్నర్ గా నిజామాబాద్ జట్టు లు నిలిచాయి. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేస నాగేందర్, కంది కట్ల రజిత, కార్యదర్శి దాసు పాల్గొన్నారు.