సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలో ఈనెల 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా జూడో సంఘం అధ్యక్షుడు మాటేటి సంజీవ్ కుమార్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ తెలిపారు. శనివారం పోటీల పోస్టర్లను క్రీడా సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవుతున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సిలివేరి మహేందర్, కృష్ణప్రియ, దాసరి రమేశ్, శంకరయ్య, బైరగోని రవీందర్, కుమార్ కిశోర్, ఇక్బాల్, సత్యనారాయణ, శివ పాల్గొన్నారు.