ఆర్కేపీలో రాష్ట్ర స్థాయి గర్ల్స్​ఫుట్ బాల్ పోటీలు..జనవరి 9 ప్రారంభించనున్న ఎంపీ వంశీకృష్ణ

ఆర్కేపీలో రాష్ట్ర స్థాయి గర్ల్స్​ఫుట్ బాల్ పోటీలు..జనవరి 9 ప్రారంభించనున్న ఎంపీ వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఠాగూర్​ స్టేడియంలో ఈనెల 9 నుంచి రాష్ట్ర స్థాయి(సౌత్​జోన్) అండర్​-13 గర్ల్స్​ఫుట్​బాల్​ఛాంపియన్​ షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. పోటీల కోసం చేపట్టిన పనులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్​బాల్​ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ ​కమిషనర్ గద్దె రాజు, పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు  మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా రఘునాథ్​రెడ్డి.. మాట్లాడుతూ ఐదు రోజుల పాటు లీగ్​పద్ధతిలో జరిగే పోటీలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ ​కుమార్​ దీపక్​ ప్రారంభిస్తారని తెలిపారు. పోటీల్లో మొత్తం 7 జిల్లాల చెందిన 170 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీల నిర్వహణకు మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం, క్యాతనపల్లి మున్సిపల్​ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఏఈ అచ్యుత్, కాంగ్రెస్ ​టౌన్​ ప్రెసిడెంట్, పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు పల్లె రాజు, గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య, ఒడ్నాల శ్రీనివాస్, క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.