నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనివ్వండి :సునీతా రావు

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనివ్వండి :సునీతా రావు
  • రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

హైదరాబాద్, వెలుగు: త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. పదవులు ఇవ్వకపోతే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని పార్టీ నాయకత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని తెలిపారు. గురువారం గాంధీ భవన్​లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. పదేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్​కు కు వ్యతిరేకంగా పోరాడినందుకు తనతో పాటు చాలా మంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారని, పార్టీ అధికారంలోకి వచ్చినందుకు తమకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తమకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.