సీజనల్ వ్యాధులపై ప్రజలు అలర్ట్ ఉండాలి : కమిషనర్ కర్ణన్

  • రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 
  • ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ

ఖమ్మం టౌన్, వెలుగు:  సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.  మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో  వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించి, ఏమేం కావాలో కమిషనర్ అడిగి తెలుసుకుని మాట్లాడారు. 

మొబైల్ హెల్త్ టీమ్ లను  ఏర్పాటు చేసినట్లు, ఇంటింటికి వెళ్లి హెల్త్ చెకప్ లు చేస్తాయని తెలిపారు. అనంతరం జిల్లా  ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వరదల కారణంగా వ్యాధుల బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 

ఆయన వెంట కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ సంపత్,  డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఆర్ఎంఓ రాంబాబు, అధికారులు, వైద్యాధికారులు సిబ్బంది ఉన్నారు.