- మంత్రి శ్రీధర్ బాబు
మల్హర్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సన్న రకం ధాన్యంపై గ్రామ స్థాయిలో రైతులకు స్పష్టంగా తెలిసేలా ప్రచారం కల్పించాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. రైస్ మిల్లర్లు తాలు పేరుతో కోతలు పెట్టవద్దన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.
కాటారంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాటారం, వెలుగు: కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీధర్ బాబు పర్యటించారు. కాటారంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.