గ్రేటర్ హైదరాబాద్‌లో 23 చోట్ల మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్‌లు, అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ‘ ది అర్బన్ లూ కంపెనీ సొంత నిధులతో టాయిలెట్లను నిర్మించి, నిర్వహణ చేపట్టనుంది. పే అండ్ యూజ్ పద్ధతిలో వినియోగదారుల నుంచి రుసుం వసూలు చేయనుంది.
ఖైరతాబాద్ లో ఎనిమిది మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్‌లు, ఎల్‌బీ నగర్‌లో ఐదు, చార్మినార్‌లో మూడు, శేరిలింగంపల్లిలో రెండు, కూకట్‌పల్లిలో ఒకటి, సికింద్రాబాద్ జోన్‌లో నాలుగు చొప్పున మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్‌లు నిర్మించనున్నారు . సాధారణ పబ్లిక్ టాయిలెట్ల మాదిరిగా కాకుండా, మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్‌లు ఆధునిక టచ్‌తో టాయిలెట్లను షవర్ సౌకర్యాలతో అమర్చబడి ఉంటాయి.
ఈ టాయిలెట్లలో శానిటరీ నాప్‌కిన్ల డిస్పెన్సరీ, బేబీ చేజింగ్ స్పేస్, వాటర్ లెస్ టాయిలెట్, వాసనలేని యూరినల్స్ తదితర ప్రత్యేకతలు ఉంటాయి.