యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక

యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక

యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​(యూఎన్​ఎఫ్​పీఏ) స్టేట్​ ఆఫ్​ వరల్డ్​ పాపులేషన్​–2024 నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా వేసింది.  

 దేశ జనాభాలో 0–14 సంవత్సరాల పిల్లల జనాభా 24 శాతంగా తెలిపింది. 10–19 సంవత్సరాల మధ్య వయసున్న వారి జనాభా 17 శాతం. కాగా, 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు 68 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 65 ఏళ్లు పైబడిన వారు 7 శాతం ఉన్నారు. 

పురుషుల ఆయుర్ధాయం 71ఏళ్లు, స్త్రీల ఆయుర్ధాయం 74 సంవత్సరాలు. 2006 నుంచి 2023 మధ్య భారతదేశంలో బాల్య వివాహాల శాతం 23గా ఉందని పేర్కొంది. 
పీఎల్​ఓఎస్​ గ్లోబల్​ పబ్లిక్​ హెల్త్​ నివేదికను ఉదహరిస్తూ 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో 70 కంటే తక్కువగా ఉంది. 114 జిల్లాల్లో ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉంది.