సర్కారు బడుల్లో ఏమైతున్నది?

  • 33 జిల్లాల్లోనూ స్టేట్ ఆఫీసర్ల సడెన్ విజిట్
  • స్కూళ్లలో ఏం ఉంది.. ఏం లేదనే డేటా సేకరణ
  • ఇక ప్రతి నెలా పర్యటించేలా ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వంపై దృష్టి సారించింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు సమాయత్తం అయింది. దీంట్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్టేట్ లెవెల్ ఆఫీసర్లు సడెన్ విజిట్స్ నిర్వహించారు. దీంట్లో బడుల్లో ఏం జరుగుతున్నది.. ఏం ఉంది ఏమీ లేదు అనే వివరాలను సేకరించింది. దీంట్లో వచ్చే లోపాలను సవరించుకొని, పిల్లలకు మంచి వసతులు, నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్నది.

ప్రతినెలా ఇదే విధానాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. స్టేట్ వైడ్​గా 26 వేల సర్కారు బడుల్లో 18లక్షల మంది చదువుతుంటే, 11వేల ప్రైవేటు బడుల్లో 35 లక్షల మంది చదువుతున్నారు. సర్కారు బడులపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల బలోపేతంపై ఫోకస్ పెట్టింది.

దీంట్లో భాగంగా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలోనే అన్ని సర్కారు బడుల్లో ఫెసిలిటీస్, రిపేర్లు, చిన్న పనులను చేయించారు. ఈ క్రమంలోనే విద్యార్థుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. అయితే, గ్రౌండ్​ లెవెల్​లో ఎలా ఉందనే వివరాలు తెలుసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి బడుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారని అధికారులు చెప్తున్నారు.

ఆకస్మిక తనిఖీలు

బడుల్లో పరిస్థితులు తెలుసుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ప్రణాళిక రూపొందించారు. దీంట్లో భాగంగా 33 మంది రాష్ట్రస్థాయి ఆఫీసర్లను 33 జిల్లాలకు పంపించారు. ప్రతి అధికారి ఆ జిల్లాలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మూడు స్కూళ్లను (ప్రైమరీ, యూపీఎస్, హైస్కూల్స్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, టీఎస్ రెసిడెన్షియల్ గురుకులాలు) విజిట్ చేసి, రిపోర్టు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీంతో ఆఫీసర్లంతా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా బుధవారమే ఉదయం ఒక్కో బడి విజిట్ చేశారు. దీంట్లో ప్రేయర్ టైమ్ కు టీచర్లు అందరూ వస్తున్నారా లేదా అని పరిశీలించారు.

బడుల్లో క్లాసు రూములతో పాటు, ల్యాబ్స్, లైబ్రరీ, టాయ్ లెట్స్, వాటర్ ఫెసిలిటీ.. ఇలా ప్రతి సమాచారం తెలుసుకున్నారు. టీచర్లు పిల్లలకు పాఠాలు ఎలా చెప్తున్నారు.. ఇంగ్లిష్ మీడియం క్లాసులు ఎలా జరుగుతున్నాయనే వివరాలు సేకరించారు. టీచర్ల కొరత ఉంటే.. వాటి డేటాను తీసుకున్నారు. ఈ రిపోర్టును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​తో పాటు ఆ జిల్లా డీఈఓకు, స్కూల్ హెడ్మాస్టర్/ ప్రిన్సిపల్​కు పంపించారు. బడుల్లో లోపాలుంటే, సరిచేసుకోవాలని అక్కడే హెడ్మాస్టర్లకు అధికారులు సూచించారు. ప్రతినెలా ఇలా ఆకస్మిక తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా బడుల బలోపేతంపై చర్యలు తీసుకోనున్నారు.

గతంలో టోకెన్ రిలీజ్ చేసిన వారంలోపే డబ్బులు రిలీజ్ అయ్యేవి. కానీ, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్​లో ఉండటంతో కాలేజీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత సర్కారు లెక్క బకాయిలు పెట్టొద్దని స్టూడెంట్లు, మేనేజ్​మెంట్లు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

బకాయిలు విడుదల చేయాలి

రాష్ట్రంలో ప్రైవేట్​ కాలేజీలకు సర్కారు ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు భారీగా ఉన్నాయి. రెండేండ్లుగా ఒక్క పైసా రాలేదు. దీంతో కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నం. అద్దె భవనాలకు రెంట్లు కట్టే పరిస్థితి లేదు. సీఎం రెడ్డి స్పందించి, మా బకాయిలు రిలీజ్ చేయాలి.

–సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ 

నల్గొండ జిల్లాకు చెందిన ఫణికుమార్ బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2023లో పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు కావాలని వర్సిటీ అధికారులను అడిగితే.. ‘సర్కార్ నుంచి ఇంకా రూ.87 వేల ఫీజు రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది చెల్లించి తీసుకుపో’ అని చెప్పారు. సర్కార్ యూనివర్సిటీలో చదువు ఉచితమని అడ్మిషన్ తీసుకుంటే, డబ్బులు వసూలు చేయడమేంటని నిర్మల్ కలెక్టర్​కు ఫణికుమార్ ఫిర్యాదు చేశాడు. అయినా ఇప్పటికీ అతనికి సర్టిఫికెట్లు అందలేదు. 

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణి జేఎన్టీయూహెచ్​లో 2024 జనవరిలో ఎంఎస్సీ కెమిస్ర్టీ పూర్తి చేసింది. సర్టిఫికెట్ల కోసమని వర్సిటీకి వెళ్తే.. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని, వచ్చాకే ఇస్తామని అధికారులు చెప్పారు. సర్టిఫికెట్లు వెంటనే కావాలంటే రూ.40 వేల ఫీజు కట్టి తీసుకెళ్లాలని సూచించారు.  

హైదరాబాద్ సిటీకి చెందిన ఓ విద్యార్థిని జేఎన్టీయూహెచ్​లో నిరుడు ఫస్టియర్​లో జాయిన్ అయింది. ఈ ఏడాది జేఈఈలో మంచి ర్యాంకు రావడంతో, ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు వచ్చింది. ఈ నెలలో అక్కడ జాయిన్ కావాలి. సర్టిఫికెట్ల కోసం పోతే, ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు రూ.లక్ష కట్టి తీసుకుపోవాలని సూచించారు. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది.