తెలంగాణ పల్లెలు అభివృద్ధి దిశగా పయనం

తెలంగాణ పల్లెలు అభివృద్ధి దిశగా పయనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామం ఇప్పుడు ఆదర్శగ్రామమేనని ఆయన కొనియాడారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణకు మొత్తం 19 అవార్డులు దక్కాయి. అవార్డు పొందిన పంచాయతీల సర్పంచులు, చైర్మన్లను ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు. దీనికి కారణమైన అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ప‌ల్లె ప్ర‌గ‌తి సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డులే నిద‌ర్శ‌నమని అన్నారు. సీఎం కేసిఆర్ వ‌ల్లే ఇది సాధ్య‌మైందన్నారు.

అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అవార్డులు వ‌చ్చిన గ్రామ పంచాయ‌తీలు, ఎంపీపీలు, జెడ్పీలు ఆ స్థాయిని నిలుపుకోవాలని, ఈ విడ‌ద‌త నిర్వ‌హించ‌నున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిని ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలని సూచించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందన్న మంత్రి... 2001 నుంచి 2014 వరకు అప్పటి ఉమ్మటి రాష్ట్రానికి ఒకే ఒక అవార్డు వచ్చిందన్నారు. కానీ ఈ ఒక్క ఏడాదే 19 అవార్డులు వచ్చాయంటే తెలంగాణలో పల్లెల ప్రగతి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్ ఆగ్రహం