ప్రజావాణికి 15 నెలల్లో 53 వేల ఫిర్యాదులు.. 66 శాతం పరిష్కారం

ప్రజావాణికి 15 నెలల్లో 53 వేల ఫిర్యాదులు.. 66 శాతం పరిష్కారం

ప్రజావానికి ఇప్పటివరకు 53 వేల 303 ఫిర్యాదులు వచ్చాయన్నారు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మెన్  చిన్నారెడ్డి.  ఇందులో 35,001   అంటే 66 శాతం  ప్రజల సమస్యలను పరిష్కరించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ప్రజావాణి, ప్రజాపాలన పాత్రపై సమీక్ష నిర్వహించారు. హైడ్రా కమిషనర్  రంగనాథన్, ఐఏఎస్  ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్,ప్రజావాణి నోడల్ ఆఫీసర్స్, సపోర్టింగ్  స్టాఫ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన చిన్నారెడ్డి..  2023 డిసెంబర్ 8 నుంచి ప్రజావాణి మొదలు పెట్టాం. వారానికి రెండు సార్లు మంగళవారం, శుక్రవారం ప్రజావాణి జరుగుతుంది. ప్రజావాణికి  స్టార్టింగ్ లో ప్రజలకు  అంతగా నమ్మకం లేదు.  కానీ ప్రస్తుతం ప్రజల్లో ప్రజావాణి పై ఆ నమ్మకం కల్పించాం. ప్రజల సమస్య వినడానికి గత 10 యేండ్లలో ఏ సీఎం , మంత్రి  లేడు. ప్రజావానికి రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు కావాలని సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు.. ప్రజావానికి వచ్చిన వారిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు ఐఏఎస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య. 

Also Read :- మహాలక్ష్మీ గేమ్ ఛేంజర్.. ప్రజలే కేంద్రంగా పాలన

ప్రజావానికి ఒక్కోరోజు 12 వేల మంది వరకు వచ్చిన రోజులు ఉన్నాయి. ప్రజావాణిలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారికోసం  డ్రింకింగ్ ఫెసిలిటి,  30 రూపాయలు భోజనము సబ్సిడీ కింద రూ. 5 భోజనం , దివ్యాంగులకు వీల్ ఛైర్స్ ఇలా అనేక ఏర్పాట్లు చేసాం. ప్రజావాణి 66 శాతం  వరకు పరిష్కరించి ఫస్ట్  క్లాస్ లో పాస్ అయ్యాం. డిస్టింక్షన్ వరకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ప్రజావాణిని మరింత ముందుకు తీసుకెళ్తాం అని చెప్పారు.