ఊరూరా రైతు రుణమాఫీ సంబురాలు

ఊరూరా రైతు రుణమాఫీ సంబురాలు

కొడంగల్, వెలుగు:కాంగ్రెస్​ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర పోలీస్​హౌజింగ్​కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా శుక్రవారం కొడంగల్​లో సీఎం రేవంత్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.  పీఏసీఎస్​అధ్యక్షుడు శివకుమార్, నేతలు పాల్గొన్నారు.

 చేవెళ్లలో.. 

చేవెళ్ల: రైతును రాజు చేయడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ చేవెళ్ల ఇన్ చార్జ్ పామెన భీం భరత్ పేర్కొన్నారు.  రైతు రుణ మాఫీ సంద్భరంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్​, నవాబ్​పేట తదితర మండలాల్లో శుక్రవారం రైతు సంబురాలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్​రాం విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం  సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు  చిత్ర పటానికి పాలభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబురాలు చేశారు.  

 శంషాబాద్ లో.. 

శంషాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యం లో పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథులుగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అర్బన్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, టౌన్ అధ్యక్షులు సంజయ్,  నరేందర్, సులోచన పాల్గొన్నారు.  

షాద్ నగర్ లో..

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని సంగెం, కొత్తపేట, కేశంపేట తదితర గ్రామాల్లో రైతులు ఘనంగా సంబురాలు నిర్వహించగా.. ముఖ్య అతిథు లుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ పాల్గొన్నారు. రైతులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి స్వీట్లు తినిపించారు.