జెన్​కోకే రామగుండం థర్మల్​ప్లాంట్ కేటాయించాలి

జెన్​కోకే రామగుండం థర్మల్​ప్లాంట్ కేటాయించాలి
  •     స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించనున్న రామగుండం థర్మల్​ప్లాంట్​ను జెన్​కోకే కేటాయించాలని స్టేట్ పవర్ ఎంప్లాయీస్  జాయింట్ యాక్షన్  కమిటీ డిమాండ్​ చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్​కో, జెన్ కో సీఎండీ రొనాల్డ్​ రాస్​కు జేఏసీ ఆధ్వర్యంలో పవర్​ ఇంజనీర్ల ప్రతినిధులుఈ మేరకు వినతిపత్రం అందించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జెన్​కోకు చెందిన రామగుండం బీ థర్మల్  పవర్  స్టేషన్ ను మూసేసిందని

అదే 580 ఎకరాల ప్లేస్ ను సింగరేణికి అప్పగించి  థర్మల్​ ప్లాంట్​ను  నిర్మించాలని యోచిస్తోందని తెలిపారు. దీంతో విద్యుత్  సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం నిర్మించబోయే కొత్త ప్రాజెక్టులన్నింటినీ జెన్ కో ద్వారానే నిర్మించాలని డిమాండ్  చేశారు.