![ప్రైవేట్ టీచర్లకు12 నెలల జీతం ఇవ్వాలి : బస్కూరి కేపీ కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/state-president-baskuri-kp-kumar-has-demanded-that-private-teachers-be-given-12-months-salary_9FH5Mpdkaj.jpg)
సూర్యాపేట, వెలుగు : ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు 12 నెలల జీతాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బస్కూరి కేపీ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో టీపీయూఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతతోపాటు హెల్త్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు.
ప్రైవేట్ టీచర్లపై వివిధ పాఠశాలల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లలమర్రి కళింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బచ్చలకూరి జానయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మహేశ్, యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి ఎం.సోమరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి కంచి వెంకన్న, కట్టంకూరి లక్ష్మణ్, జిల్లా కోశాధికారి బాలకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.