కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం : దండి వెంకట్

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం : దండి వెంకట్

ముషీరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని కార్పొరేట్ గుత్తేదారులకు కాసుల వర్షం కురిపించే విధంగా ఉందని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం నల్లకుంటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణకు తగినన్ని నిధులను సాధించడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. 

రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి  తిరిగి అనేక వినతిపత్రాలు ఇచ్చిన లాభం లేకండా పోయిందని తెలిపారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది బీడీ కార్మికుల సంక్షేమం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కేంద్ర  ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. బహుజన లెఫ్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. ‌‌సిద్ధి రాములు పాల్గొన్నారు.