గురుకుల ఉద్యోగుల జీతాలు 010 పద్దు కింద ఇవ్వాలి : దిలీప్ కుమార్ రెడ్డి

గురుకుల ఉద్యోగుల జీతాలు 010 పద్దు కింద ఇవ్వాలి : దిలీప్ కుమార్ రెడ్డి

• సీఎస్కు పీఆర్టీయూ వినతి

 హైదరాబాద్ వెలుగు: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లోని ఉద్యోగుల జీతాలు 010 భార ద్వారానే పంపిణీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్రావు, పీఆర్టీటీఏ రాష్ట్ర అధ్యక్షు డు దిలీప్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పబ్లిక్, జనరల్ హాలిడేస్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సీసీఎల్ క్లెయిమ్ చేసేందుకు చాన్స్ ఇవ్వాలని కోరారు. అన్ని గురుకుల విద్యా సంస్థలకు రెండో శనివారం సెలవుగా ప్రకటించాలన్నారు. 

మంగళవారం సెక్రటేరియెట్ లో సీఎస్ శాంతికుమార్, ప్రభు త్వసలహాదారు మే సరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో వారు కలిశారు. రాష్ట్ర ప్రభు త్వ జీవిత బీమా (టీఎస్జీఎల్ ఐ) స్కీము గురుకుల ఉద్యోగులందరికీ వర్తింపజేయాల ని, టీవధను బోధనేతర విధుల నుంచి విముక్తి చేయాలని, గురుకులాల్లోకేర్ టేకర్స్ డిప్యూటీ వార్డెన్లను నియమించాలని కోరారు.