ఖానాపూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్​గా అంకం మహేందర్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గా అంకం మహేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగిరేలా తన వంతు కృషి చేస్తానన్నారు.