- ఇప్పటికైనా ఫీజు బకాయిలు చెల్లించాలి
- స్టూడెంట్ల నిరసన ర్యాలీలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
ఎల్బీనగర్, వెలుగు : పెండింగ్ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా స్టూడెంట్లు ఉద్యమిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి బిల్లులు రిలీజ్చేయాలని కోరారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంజి స్టూడెంట్లతో కలిసి గురువారం దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ పేద విద్యార్థులపై లేదని విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఇటీవల కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చేపట్టినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపడంతో చదువు పూర్తయిన యువత ఉద్యోగాలకు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. వెంటనే రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించి, స్కాలర్షిప్ ను రూ.20వేలకు పెంచాలని డిమాండ్చేశారు. ప్రైవేట్యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు.