జీవో 51ను ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టారు..?

మునుగోడు అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్ కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. మునుగోడుకు ఎన్ని నిధులిచ్చారో సభలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ బిడ్డపై ఆరోపణలతోనే సీబీఐకి నో ఎంట్రీ జీవో ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటి వరకు 36 మందిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను చండూరు సభకు కేసీఆర్ తీసుకొస్తారని బండి సంజయ్ కామెంట్ చేశారు.  

కేసీఆర్ తప్పు చేయకుంటే.. సీబీఐకి ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. జీవో 51ని విడుదల చేసి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని దోచుకోకపోతే సీబీఐ అంటే ఎందుకు భయం అన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా బయటికి తీసుకొస్తామన్నారు.