సీపీఎస్ ను రద్దు చేయాలి: ఎంప్లాయీస్ యూనియన్ వినతి

సీపీఎస్ ను రద్దు చేయాలి: ఎంప్లాయీస్ యూనియన్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీపీఎస్  విధానాన్ని రద్దుచేసి, పాత పింఛన్  విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్​ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వా న్ని కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ ను ఆ సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. 

కేంద్ర ప్రభుత్వం సీపీఎస్  స్థానంలో తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలని స్థితప్రజ్ఞ  అన్నారు. సీపీఎస్  రద్దు కోసం ప్రభుత్వం ఏర్పాటులో సీపీఎస్  ఉద్యోగులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్  చేశారు. 

టీపీసీసీ చీఫ్​ ను కలిసిన వారిలో సీపీఎస్​ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, గడ్దం వెంకటేశ్, బాలస్వామి తదితరులు ఉన్నారు.