సీపీఎస్​ను  రద్దు చేయండి : దాముక కమలాకర్

సీపీఎస్​ను  రద్దు చేయండి : దాముక కమలాకర్
  • ఎమ్మెల్సీ కోదండరామ్ కు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విజ్ఞప్తి  

హైదరాబాద్, వెలుగు: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్​నాంపల్లిలో ఎమ్మెల్సీ కోదండరామ్ ను ఆయనతోపాటు రాష్ట్ర కోశాధికారి వెంకట్ నారాయణ రెడ్డి, సహధ్యక్షుడు మధు బాబు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విషయంలో ఆర్థిక భారం కాని అంశాలను వెంటనే పరిష్కరిస్తామని తెలపడం హర్షణీయమని తెలిపారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదని, ఉద్యోగులకు ప్రతినెలా కట్టాల్సిన కంట్రిబ్యూషన్ ఉండదని, ప్రభుత్వానికి రూ.వేల కోట్ల  లాభం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాత పెన్షన్  విధానాన్ని పునరుద్ధరించేలా సహకరించాలని ఎమ్మెల్సీని కోరారు.