వేములవాడరూరల్, వెలుగు: మానాల అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు.
హనుమాన్ తండాలో రోడ్డు పనులకు, తాతమ్మ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. రూ.20లక్షలతో కొత్తగా నిర్మించిన దేగావత్ తండా జీపీ భవనాలను ప్రారంభించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మానాలలో 762 కుటుంబాలకు 1750ఎకరాల పోడు పట్టాలు పంపిణీ చేశామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, వైస్ ఎంపీపీ భూమయ్య, బీఆర్ఎస్మండల అధ్యక్షుడు తిరుపతి, ఎంపీటీసీ గంగిబాయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.