త్వరలో ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ షాపులు

త్వరలో ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ షాపులు

న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌) రిటైల్ షాప్‌‌‌‌‌‌‌‌లను ఫ్రాంచైజ్ విధానంలో ఓపెన్ చేయాలని చూస్తోంది.  ‘ఉర్జ దక్షత దుకాన్‌‌‌‌‌‌‌‌’  పేరుతో వీటిని ఓపెన్ చేయనుంది. ఈ షాపులలో కరెంట్ ఆదా చేసే ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్లు, ఏసీలు, ఫ్యాన్లు వంటివి అమ్మనుంది.

ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్ ప్రస్తుతం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను రిటైల్ షాపులకు డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.  ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ డాట్ ఇన్‌‌‌‌‌‌‌‌ ద్వారా  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్ముతోంది.  మొదటి విడతలో భాగంగా  జార్ఖండ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈఈఎస్‌‌‌‌‌‌‌‌ఎల్ ఫ్రాంచైజి షాప్‌‌‌‌‌‌‌‌లను ఓపెన్   చేయనుంది.  సంస్థ సహకారంతో ఎవరైనా ఈ  షాప్‌‌‌‌లను ఓపెన్ చేయొచ్చు.