బజార్ హత్నూర్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పలు ఫర్టిలైజర్స్ షాపుల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పండించే రైతులకు డీలర్ షాప్ ఓనర్లు విత్తనాలపై అవగాహన కల్పిస్తూ కొనుగోలులో జాగ్రత్తలు తెలపాలని సూచించారు.
అనంతరం సహకార సంఘ ఆఫీసును సందర్శించారు. పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, సీఈఓ నారాయణ గౌడ్, బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోరెడ్డి నారాయణ, సొసైటీ డైరెక్టర్ చట్ల వినీల్, ఆగ్రో సంస్థ ఓనర్ బత్తిని సుధాకర్, మండల నేతలు ఉన్నారు.