యాసంగి సాగు కోసం నీటివిడుదల

యాసంగి సాగు కోసం నీటివిడుదల
  • స్టేట్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి

బాల్కొండ, వెలుగు : యాసంగి సాగులో  చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని స్టేట్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారి ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.

ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు ఉందని, చివరి ఆయకట్టుకు నీటిని  అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు ఉందని, యాసంగి సాగుకు ఢోకా లేదన్నారు.  కాకతీయ కాలువకు మొదట 3 వేల క్యూసెక్కులు వదిలి సాయంత్రం 5500 క్యూసెక్కులకు పెంచారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈలు చక్రపాణి, డీఈ గణేశ్, ఏఈలు, రైతులు పాల్గొన్నారు.    

సరస్వతీ కెనాల్ కు ..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరస్వతీ కెనాల్ కు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆఫీసర్లతో కలిసి నీటిని వదిలారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.