- స్థానిక సంస్థల బలోపేతంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల బలోపేతంపై పరస్పరం అవగాహన పెంపొందించుకునేందు తెలంగాణ, -కర్నాటక రాష్ట్రాలు దృష్టి సారించాయి. అందులో భాగంగా బుధవారం కర్నాటక ఆర్థిక సంఘం చైర్మన్ నారాయణ స్వామి, సభ్యులు ఎండీ.సమెల్ల, ఆర్ఎస్. పాండే ఇతర ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఆఫీసులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి, మాలోతు నెహ్రూ నాయక్, ఎంపీ. రమేశ్‌లతో పాటు ఎస్ఎఫ్సీ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటకలోని స్థానిక సంస్థల పని తీరును, ఆర్థిక పరిస్థితికి తీసుకున్న నిర్ణయాలను నారాయణ స్వామి వివరించారు. అదే విధంగా.. తెలంగాణలోని స్థానిక సంస్థల పని తీరును తెలుసుకోవడంతో పాటు ఆర్థికంగా బలోపేతానికి తీసుకుంటున్న విధానాలపై చర్చించారు.