చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా

చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా
  • రూ. లక్ష చొప్పున పంపిణీ చేసిన షీప్ ఫెడరేషన్ ఎండీ

హైదరాబాద్, వెలుగు: వివిధ ప్రమాదాలలో చనిపోయిన ముగ్గురు గొర్రెలకాపరుల కుటుంబాలకు రాష్ట్ర షీప్ ఫెడరేషన్ ద్వారా రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. మాసబ్ ట్యాంక్​లో ఉన్న ఫెడరేషన్ కార్యాలయంలో ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు బాధిత కుటుంబాలకు శనివారం పరిహారం అందించి మాట్లాడారు. గత కొన్నేండ్లుగా వివిధ కారణాలతో జనగాం, నారాయణపేట్ జిల్లాలకు చెందిన గొర్రెల కాపర్ల ఎక్స్ గ్రేషియా పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందించామని తెలిపారు. 

ప్రభుత్వం నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.