​వరంగల్ లో షాపింగ్ మాల్ ప్రారంభం

 ​వరంగల్ లో షాపింగ్ మాల్ ప్రారంభం

కాశీబుగ్గ, వెలుగు:  గ్రేటర్​వరంగల్ సిటీలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఆదివారం రాష్ర్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ నగరాలకు ధీటుగా నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించాలని యాజమాన్యానికి సూచించారు. యుక్త వయస్సులో షాపింగ్ మాల్ ను స్థాపించిన యాజమాన్యాన్ని అభినందించారు.

కాగా, ప్రతి పదివేల కొనుగోలుపై బంగారు నాణెం, విద్యార్థులకు 10 శాతం రాయితీ అందిస్తున్నామని యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్​మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ గందే కల్పన, పల్లం పద్మ, షాపింగ్ మాల్ యాజమాన్యం వర్రి లలిత్,  ప్రదీప్ కుమార్ బజాజ్, సూరజ్ సరడ, పి.హరీశ్, పి.రిషిత తదితరులు పాల్గొన్నారు.