ఆర్​ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన

సిరికొండ, వెలుగు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల  పోరాట కమిటీ పిలుపు మేరకు మండలంలోని రావుట్ల హైస్కూల్​లో టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా కేవలం 5 శాతం ఐఆర్​ప్రకటించడం సరికాదన్నారు. అన్నీ రకాల పెండింగ్​బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో స్టీరింగ్​ కమిటీ బాధ్యులు ఎం. బాలయ్య, టీచర్లు దేవీసింగ్, సుమలత, రాజు, సుధాకర్, దేవిక, దేవేందర్,శ్యామల,సంజయ్ పాల్గొన్నారు.