చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ మండలంలోని పలు స్కూళ్లలో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును రాష్ట్ర స్థాయి బృందం గురువారం పరిశీలించింది. చండ్రుగొండ, అయ్యన్నపాలెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను సభ్యులు సందర్శించారు. పాఠాల బోధన, పాఠ్య ప్రణాళికలు, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, టీచర్ల డైరీలను పరిశీలించారు.
హెచ్ఎం, టీచర్ల కు పలుసూచనలు చేశారు. రాష్ట్ర బృందం సభ్యులు రమేశ్ రావు, విజయ భాస్కర్రావు, ఎంఈవో సత్యనారాయణ, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల నోడల్ ఆఫీసర్లు కార్తీక్, ఆనంద్ కుమార్, హెచ్ఎంలు పాల్గొన్నారు.