- టీజీబీ చైర్ పర్సన్ వై.శోభ
- కల్లూర్ లో మహిళా సంఘాలకు రూ.50 కోట్ల రుణాల అందజేత
కుంటాల, వెలుగు: ప్రతి మహిళా పొదుపును అలవర్చుకొని బ్యాంకు రుణాలను సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర టీజీబీ చైర్ పర్సన్ వై.శోభ అన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు రూ.50 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 427 శాఖల్లో రూ .3,300 కోట్ల మేర రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా పంపిణీ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ శోభను మహిళా సంఘాల సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయ లక్ష్మి, ఆర్ఎమ్ రామారావు, ఏపీడీ గోవింద్ రావు, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఏపీవో నవీన్, కుంటాల, కల్లూర్, వానల్ పాడ్ మేనేజర్లు సంతోష్, రాంచందర్, శ్రీకాంత్, ఐకేపీ, బ్యాంక్ సిబ్బంది, వివిధ మండలాల మహిళలు పాల్గొన్నారు..