రామప్ప పనులు త్వరగా కంప్లీట్ చేయండి : స్మితా సబర్వాల్

రామప్ప పనులు త్వరగా కంప్లీట్ చేయండి : స్మితా సబర్వాల్

వెంకటాపూర్( రామప్ప), వెలుగు:  రామప్ప ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుల పనులు త్వరగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఆమె సందర్శించారు.  ఆలయ ఆవరణలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలని  సలహాలు, సూచనలు చేశారు. 

త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. టెంపుల్ కి వచ్చిన పర్యాటకులతోనూ మాట్లాడి వసతులపై అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల ఆలోచన మేరకు ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి, హెరిటేజ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ లక్ష్మితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. 

పర్యాటకులను ఆకర్షించేలా బ్లాక్ బెర్రీ ఐలాండ్ దీవి 

తాడ్వాయి : పర్యాటకులను ఆకర్షించేలా బ్లాక్ బెర్రీ ఐలాండ్ దీవి ఉందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. తాడ్వాయి మండలం ముండ్యాల తోగు సమీపంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ దివిని సందర్శించారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా ఉందని,  ఏర్పాట్లు కూడా బాగున్నాయని అధికారులను  ఆమె అభినందించారు.