యాక్సిడెంట్లలో యువత ప్రాణాలే ఎక్కువగా పోతున్నయ్

యాక్సిడెంట్లలో యువత ప్రాణాలే  ఎక్కువగా పోతున్నయ్
  • రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్​ సురేంద్ర మోహన్

మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువ శాతం చనిపోతున్నారని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్  సురేంద్ర మోహన్  తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్ బీ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 నుంచి 35 ఏండ్ల వారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. 

విద్యార్థులకు ట్రాఫిక్  రూల్స్​పై అవగాహన కల్పించాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలు, వాలంటీర్లను నియమించాలని కోరారు. జాయింట్  ట్రాన్స్​పోర్ట్  కమిషనర్  చంద్ర శేఖర్ గౌడ్, అడిషనల్​ కలెక్టర్  మోహన్ రావు, ఆర్అండ్ బీ ఈఈ దేశ్యా నాయక్, డీటీసీ కిషన్  పాల్గొన్నారు.