- వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్...
నిర్మల్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రోగులకు అన్ని రకాల కార్పొరేట్ స్థాయి సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ లోని అన్ని వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌక ర్యాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రీట్మెంట్ అందించాలన్నారు. కమిషనర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ గోపాల్ సింగ్, డీసీ హెచ్ ఎస్ డాక్టర్ సురేశ్, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజేందర్, డాక్టర్లు పాల్గొన్నారు.