ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

లింగంపేట, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్ కౌన్సిలర్  మన్నె కృష్ణ సూచించారు. మండలంలోని లింగంపల్లి ఖుర్ధు గ్రామంలో బుధవారం కెనరా బ్యాంక్, ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బ్యాంక్​ఖాతా, పిన్ ​నంబర్ చెప్పాలని అడిగితే ఇవ్వకూడదన్నారు. లాటరీ తగిలింద ని నమ్మబలికి ఆర్థిక మోసాలకు గురి చేస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

గంప రాజమ్మకు ప్రముఖల నివాళి

భిక్కనూరు, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. బుధవారం కాంగ్రెస్​మాజీ మంత్రి షబ్బీర్​ఆలీ, భిక్కనూరు ఆర్యవైశ్య సంఘ సభ్యులు, రామేశ్వరపల్లి వీడీసీ సభ్యులతో పాటు మరి కొందరు విప్ సొంత గ్రామమైన బస్వాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఆయనను పరామర్శించారు. మాజీ మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమ్​రెడ్డి, ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుంట లింగారెడ్డి, సిద్దగౌడ్, అందె దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీఆర్ఎస్​ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

బైకు దొంగ అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ బైపాస్ వద్ద బైకు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. బుధవారం టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ స్థానిక గౌతమ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సూర్యవంశి సాయికుమార్ బైక్ ఆపి చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో అతడు పారిపోయే యత్నం చేశాడు. పట్టుకుని విచారించగా దొంగతం విషయం బయట పడినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఏడు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఎన్జీవోస్ కాలనీకి చెందిన శ్రావణ్​ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ కిరణ్, సిఐ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూరల్ ఎస్సై లింబాద్రి పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లుల పంపిణీ

బోధన్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణా నికి సంబంధించిన రెండో విడత బిల్లులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నేత బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ప్రవేశపెట్టారన్నారు. ఎమ్మెల్యే షకీల్ కృషితో 44 మంది లబ్ధిదారులకు రెండో విడత రూ.75.40 లక్షల బిల్లులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనార్దన్, ఏఎంసీ వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాలూర షకీల్, ఐడీసీఎం ఎస్ డైరెక్టర్, రాజాగౌడ్,  ఫతేపూర్ సర్పంచ్ అమీర్, నాయకులు బూయ్యాన్ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంజీవ్, శివకాంత్, వెంకట్ పటేల్, సాయిరెడ్డి, సాయులు, చందూర్ సాయారెడ్డి, మౌలానా, కల్లూర్ లక్ష్మణ్, బండే గంగాధర్ పాల్గొన్నారు.

బోధన్ కోర్డులో న్యాయసేవ దినోత్సవం

బోధన్, వెలుగు: బోధన్ కోర్డులో జాతీయ న్యాయసేవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్డులోని జడ్జీలు, న్యాయవాదులు ర్యాలీ తీశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమై అనిల్ టాకీస్​రోడ్, కొత్త బస్టాండ్, శక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వరకు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం కోర్డులో జరిగిన కార్యక్రమంలో 5వ అదనపు జల్లా జడ్జి రవికుమార్ మాట్లాడుతూ న్యాయసేవ అధికార సంస్థ  సేవలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినియర్ సివిల్ జడ్జి డి.అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఎం.అపర్ణ, న్యాయవాదులు, కోర్డు సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.   

స్టూడెంట్లు క్రీడల్లో రాణించాలి

ఆర్మూర్, వెలుగు: స్టూడెంట్లు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్​ అన్నారు. ఆర్మూర్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం రెసిడెన్షియల్ స్కూల్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గురుకుల విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సక్రు నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, స్పోర్ట్స్ నోడల్ ఆఫీసర్ శేషు కుమారి, ఆర్​సీవో మేరీ యేసుపాదం, ఆర్ఐవో రఘురాజ్, ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, టోర్నమెంట్ ఓవరాల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి నీరజారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయభాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడండి: ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లకు సూచించారు. ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంపీ నివాసంలో బుధవారం పార్టీ బలోపేతం కోసం ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ బలోపాతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్, కో కన్వీనర్, పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పలువురికి పరామర్శ

ఇటీవల మరణించిన బీజేపీ ఆర్మూర్ మండల మాజీ అధ్యక్షుడు వేల్పూర్ భూమేశ్వర్ కుటుంబాన్ని ఎంపీ అర్వింద్ పరామర్శించారు. భూమేశ్వర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తర్వాత ఆర్మూర్ పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షుడు  పీర్ సింగ్ మాతృమూర్తి అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.


‘మత చిచ్చుకు మందేశారు’

నవీపేట్, వెలుగు: మత చిచ్చు రేపుతున్న బీజేపీకి మునుగోడు ఓటర్లు ఓట్లతో మందు వేశారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు.  నవీపేట్, యంచలో దేవాలయాల డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఫలితాన్ని ముందే చెప్పానన్నారు. యాంఛ విఠలేశ్వర ఆలయానికి ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన రూ.50 లక్షలతో సీసీ రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు శ్రీరామాలయ  పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సవిత బుచ్చన్న, సర్పంచ్ లహరి ప్రవీణ్ పాల్గొన్నారు.                                                                              

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే రాష్ట్ర అభివృద్ధి : స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

వర్ని, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. రుద్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ. 20 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించడంతో పాటు రూ.35 లక్షలతో నిర్మించనున్న లైబ్రరీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత, జడ్పీటీసీ నరోజి గంగారాం, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తదితరులు పాల్గొన్నారు.


అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : ఎమ్మెల్యే హన్మంత్ షిండే 

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలందరికీ అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆఫీసర్లకు సూచించారు. బుధవారం ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిజాంసాగర్ మండలానికి ఐదు అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సబ్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. దళిత బంధు పథకం కింద డెయిరీ కోసం అప్లై చేసుకున్న లబ్ధిదారులకు లంపీ స్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాధి వల్ల గేదెల యూనిట్లు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోందన్నారు. త్వరలో వీరికి గేదెలు ఇప్పిస్తామని తెలిపారు. మండలంలోని తెలగపూర్, గలిపూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులు, పంట పొలాల్లోకి దారుల వెంట కల్వర్టు నిర్మాణాలకు గ్రాంట్ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

టీఆర్ఎస్ వార్డు మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీలోకి..

భిక్కనూరు, వెలుగు: మండలంలోని కంచర్ల గ్రామ ఒకటో వార్డు సభ్యుడు పోశెట్టి రాజు టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాజీనామా చేసి బుధవారం బీజేపీ చేరారు. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామలను అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ లీడర్లు బీజేపీలోకి వస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చిన్నోళ్ల శంకర్, కంచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లె వెంకటి, రాజు, సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

చట్టాలపై అవగాహన ఉండాలి

కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్లు  చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జీ ఎస్.ఎన్ శ్రీదేవి అన్నారు. బుధవారం కామారెడ్డి గవర్నమెంట్​డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ స్టూడెంట్లకు చట్టాలపై అవగాహన ఉంటే వారు ఇతరులను చైతన్యం చేయవచ్చన్నారు. కాలేజీలు, బస్టాండ్లు, సినిమా హాల్స్ వద్ద ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి డి.కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఏమైనా సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవా సంస్థకు స్టూడెంట్లు​ ఫిర్యాదు చేయవచ్చన్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, పీపీ నందరమేశ్, బార్ అసోసియేషన్​ ప్రెసిడెంట్ అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ప్రిన్సిపాల్ కె.కిష్టయ్య, అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాతం సిద్ధిరాములు, శ్యామ్​గోపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, లక్ష్మణచారి, శారద, లెక్చరర్లు వి.శంకర్, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు. 

కలెక్టర్, ఎస్పీలను కలిసిన సీనియర్ సిటిజన్లు

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసిమేషన్ కామారెడ్డి శాఖ ప్రతినిధులు బుధవారం కలెక్టర్​జితేష్​ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిలను కలిశారు.  ఇటీవల కొత్తగా జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. సీనియర్​ సిటిజన్స్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా శాఖ వ్యవస్థాపకులు బీఎంఎస్​వీభద్రయ్య, ప్రెసిడెంట్ ఎం.వీరయ్య, జనరల్​ సెక్రెటరీ సి.హెచ్ వెంకటి, ట్రెజరర్ కె.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.