ఎమ్మెల్యేపై మహిళా కమిషన్​కు ఫిర్యాదు

మిర్యాలగూడ, వెలుగు : ఎమ్మెల్యే  భాస్కర్​రావుపై రాష్ట్ర మహిళా కమిషన్​లో వనం విజయలక్ష్మి   ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఈ  నెల 3న  వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి ఎమ్మెల్యే వచ్చారు. గృహలక్ష్మి స్కీం జాబితాలో  తన పేరు ఉన్నా అధికారులు  తొలగించారని ఎమ్మెల్యేకు చెబుతుండగా తనపై లోకల్​ లీడర్ చెయ్యి వేసి పక్కకు నెట్టినట్లు తెలిపారు. నీకు ఇల్లు రాదు నీకు ఇయ్యను అంటూ  ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించినట్లు మహిళ కమిషన్​కు తెలిపింది.  తనపట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై తన కుటుంబ సభ్యులు బాధపడ్డారని చెప్పారు.

అనంతరం వేములపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశానన్నారు. ఇదే విషయమై బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండేటి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో కేంద్ర మంత్రి,  పార్టీ చీఫ్​ కిషన్​ రెడ్డిని కలిసి ఫిర్యాదు కాపీని అందజేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. వారి వెంట  రతన్ సింగ్ నాయక్,  సీతారామరెడ్డి,  చిర్ర సాంబమూర్తి,  పెదమం భరత్,  నాగిరెడ్డి,  భాగ్యమ్మ , సత్యనారాయణ, నరేశ్, వేణు తదితరులున్నారు.