మంథని, వెలుగు: మంథనిలో బీజేపీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బీజేపీ ఆఫీసులో బుధవారం వివిధ మండలాలకు చెందిన సుమారు 70 మంది మహిళలు సునీల్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని మహిళలు చైతన్యవంతులని, కొత్త నాయకత్వం కోసం ఆలోచన చేస్తున్నారన్నారు. డబ్బులు, ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం గడ్డం వివేక్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాని మామ కెక్కర్ల శంకర్ గౌడ్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను సునీల్‌రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధి క్రాంతి కుమార్, మల్లికార్జున్ పాల్గొన్నారు.