హైదరాబాద్, వెలుగు: యూపీఐ ట్రాన్సాక్షన్ల స్టేట్‌మెంట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి పేటీఎం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ట్రాన్సాక్షన్ల రికార్డ్‌ను ఈజీగా మేనేజ్ చేయొచ్చని పేర్కొంది. యూపీఐ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ సర్వీస్‌తో నిర్ధిష్టమైన కాల పరిమితుల్లోని రికార్డ్స్‌ను లేదా ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించిన రికార్డ్స్‌ను పీడీఎఫ్ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్, షేర్ చేసుకోవచ్చు. ఖర్చులను మానిటర్ చేయడానికి, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కు ఈ ఫీచర్ సాయపడుతుందని పేటీఎం పేర్కొంది. పేటీఎం యాప్‌లోని ‘బ్యాలెన్స్ అండ్ హిస్టరీ’ ఆప్షన్‌లో యూపీఐ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ ఫీచర్ ఉంటుంది.