కరోనాపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) దగ్గర్నుంచి సస్పెక్ట్ పేషెంట్ల ట్రాన్స్‌పోర్ట్ వరకు అన్నీ కేంద్రం చెప్పినట్టు పాటించాలంది. కరోనా పేషెంట్లు, అనుమానితులను తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు చాలా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ ఎర్త్ అనే సంస్థ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు శుక్రవారం ఈ కామెంట్స్ చేసింది. అంబులెన్స్ చార్జీలు ఎస్‌వోపీలో కవర్ కాలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టును సంస్థ కోరింది. స్పందించిన కోర్టు.. ధరలను ప్రభుత్వాలు ఫిక్స్ చేస్తాయని, ఆ రేట్లపైనే అంబులెన్స్ సర్వీసులు నడుస్తాయని చెప్పింది. కాగా, కేంద్రం మార్చి 29న అంబులెన్స్ డ్రైవర్లకు కొవిడ్ పేషెంట్లను హ్యాండిల్ చేసేలా ట్రైనింగ్ ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. 102 అంబులెన్స్‌లను గర్భిణులు, ఆరోగ్యం బాగాలేని చిన్నారుల కోసమే వాడాలని చెప్పింది.
For More News..