దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. ఆదివారం కొత్తగా 2,541 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.అయితే ఢిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 187.95 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,49,197మందికి వైరస్ పరీఓలు నిర్వహించగా.. 2,483 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
గత కొద్ది రోజులుగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్నట్లు కన్పించడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా కర్నాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు మళ్లీ మాస్క్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 22.83 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India logs 2,483 new COVID-19 cases, daily positivity rate declines
— ANI Digital (@ani_digital) April 26, 2022
Read @ANI Story | https://t.co/eOeOorEJsL#COVID19 #India pic.twitter.com/CnDhaQJHza
మరిన్ని వార్తల కోసం..