
రేషన్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సబ్సిడీతో పేదలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్దేశించబడిన లబ్దిదారులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారింది. పేరుకు మాత్రమే రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి.. సబ్సిడీలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ఆప్టిక్స్ కోసం ఉపయోగిస్తున్నాయని జస్టిస్ సూర్యకాంత్ , ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ALSO READ | టేస్టీ అట్లాస్ ర్యాంకింగ్స్.. వరల్డ్ బెస్ట్ రోటీగా..బటర్ గార్లిక్ నాన్
కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నమోదైన సుమోటో కేసును విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.బుధవారం (మార్చి 19) ఈకేసు జస్టిస్ సూర్యకాంత్ , ఎన్ కోటీశ్వర్ సింగ్ లతో కూడి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. కరోనా టైంలో అనేక మంది వలస కార్మికులు రేషన్ ప్రయోజనాలను పొందలేకపోయారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రేషన్ సరఫరాలకు అర్హులు కాని ఇతరులు రేషన్ కార్డులను దుర్వినియోగం చేయడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.ఇది నిజమైన సమస్య ..పేదలు అర్హులైన రేషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది.