సేవ చేసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి : కడియం శ్రీహరి

రఘునాథపల్లి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి సేవ చేసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే, ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే ఏకైక ప్రభుత్వం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సేనన్నారు. వరి దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిందన్నారు. 24 గంటల కరెంట్‌‌‌‌‌‌‌‌ కావాలంటే కారు గుర్తుకు, మూడు గంటల కరెంట్‌‌‌‌‌‌‌‌ కావాలంటే చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని చెప్పారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మారుజోడు రాంబాబు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొల్లం అజయ్, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం అధ్యక్షుడు పోకల శివకుమార్, నాయకులు ముసిపట్ల విజయ్, వారాల రమేశ్‌‌‌‌‌‌‌‌, కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, నామాల బుచ్చయ్య పాల్గొన్నారు.

ALSO READ : నెల కష్టపడండి.. ఐదేళ్లు సేవ చేస్తా : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు