నిజాయతే నా బలం : కడియం శ్రీహరి

ధర్మసాగర్/స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నీతి, నిజాయతీలే తన బలం అని స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కడియం శ్రీహరి చెప్పారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను గెలిచిన సంవత్సరంలోపు వేలేరు మండలంలో ప్రభుత్వ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ కట్టిస్తానని హామీ ఇచ్చారు.

తాను గెలిచిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవి రాజయ్యకు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏనుగుల రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత, మండల అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీపీ సమ్మిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకు దారి తీశాయి. కడియం మాట్లాడుతుండగా సమ్మిరెడ్డి కలుగజేసుకొని ‘నామనిషి అనుకున్న వారిని మాత్రమే ప్రోత్సహించడం వల్ల మిగతా వాళ్లు బాధపడుతున్నారు.

ALSO READ : మోసపూరిత హామీలు నమ్మొద్దు : దొంతి మాధవరెడ్డి

నిజమైన కార్యకర్తలందరినీ ప్రోత్సహించాలి’ అని కోరారు. దీంతో కడియం వర్గీయులు లేచి ‘అందరం కలిసి పనిచేయాలని అనుకున్నాం కదా.. మళ్లీ ఇలాంటి మాటలు ఎందుకు’ అంటూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కలుగజేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో కడియం పాల్గొన్నారు.