Kadiyam vs Rajaiah: మాటలు జాగ్రత్త

జనగామ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చురకలంటించారు. ఒకే వేదికపై కూర్చున్న రాజయ్యకు పరోక్షంగా చురకలంటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రవర్తన, వ్యవహారం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘వేల కళ్ళు మనల్ని చూస్తుంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అప్పుడే ప్రభుత్వం పరువు, పార్టీ పరువు బాగుంటది. రేపు ఎన్నికలకు వెళ్తే ప్రజలే ఎదురొచ్చి ఓట్లేస్తారు’ అంటూ రాజయ్యకు పరోక్షంగా విమర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.