
రఘునాథపల్లి, వెలుగు : బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ తాగుబోతుల రాష్ట్రంగా మారిందని స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ క్యాండిడేట్ సింగపురం ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ప్రచారం నిర్వహించి, ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇస్తూ నిరుద్యోగులను రోడ్డున పడేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లింగాల జగదీశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవి, ఎంపీటీసీలు పేర్ని ఉష రవి, అల్లిబిల్లి కృష్ణ, గూడెల్లి శిరీష సురేశ్, యువరాజు, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.