సీఎం రేవంత్ రెడ్డికి పదవి పోతుందనే భయం : కడియం శ్రీహరి 

హనుమకొండ సిటీ,వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డికి  పదవి పోతుందనే భయం పట్టుకుందని స్టేషన్ ఘన్ పూర్  నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.  గురువారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు..  ఆరు గ్యారంటీల   పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో అర్థం  కావడం లేదన్నారు.  బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల  
పోస్టులను భర్తీ చేసి 28వేల  ఉద్యోగాలు తామే భర్తీ చేసామని  అబద్ధాలు చెబుతున్నారన్నారు.