జనగామ, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామలోని ఎన్ఎంఆర్ గార్డెన్స్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
1994లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మొదలైన దండోరా ఉద్యమానికి ఆగస్టు1న వచ్చిన తీర్పు వరకు తాను అన్ని విధాలా అండగా ఉన్నానని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలకు ప్రస్తుతం 15 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలవుతుందని.. దీనిని 18 శాతానికి పెంచాలని, అప్పుడే మాదిగ, ఇతర ఉపకులాలకు జనాభా ప్రాతిపదికన లాభం జరుగుతుందని కడియం అన్నారు.
2004 నుంచి 2024 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వర్గీకరణపై దృష్టి సారించలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు నాగేందర్, అజయ్, రాంబాబు, దిలీప్‌రెడ్డి, నాగరాజు, లింగాల జగదీశ్వర్‌రెడ్డి, గణపతి పాల్గొన్నారు.